భారీ ధర పలుకుతున్న బెల్లంకొండ సినిమా హక్కులు

Published on Feb 19, 2020 3:00 am IST

యాక్షన్, కమర్షియల్ ఎంటెర్టైనర్లకు మార్కెట్లో క్రేజ్ ఎప్పుడూ తగ్గదు. కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చేసి హిట్ కొట్టగలిగితే వచ్చే లాభాలు, స్టార్ డమ్ వేరే లెవల్లో ఉంటాయి. అందుకే యువ హీరోలు చాలామంది అదే ఫార్మాట్లో చిత్రాలు చేస్తుంటారు. అలాంటివారిలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. ఇటీవలే ‘రాక్షసుడు’ లాంటి థ్రిల్లర్ చేసి హిట్ అందుకున్న ఆయన ఈసారి ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సబ్జెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఇదివరకే చెప్పనట్టు సినిమా కోసం నిర్మాత సుబ్రమణ్యం హెవీగానే ఖర్చు చేస్తున్నారు. తాజా సమచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యేలా ఉన్నాయని, ఈ మొత్తం బడ్జెట్లో 35 నుండి 40 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నభ నటేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తుండగా చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన భారీ హౌస్ సెట్టింగ్లో చిత్రీకరణ జరుగుతోంది.

సంబంధిత సమాచారం :

X
More