ఆ చిన్న సినిమాకు అక్కడ భారీ డిమాండ్ !

radham3

గతంలో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయంటే ఎవరు పట్టించుకొనే వారు కాదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పద్ధతి మారింది. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి , ఆర్ఎక్స్ 100 ‘చిత్రాలు సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు చిన్న సినిమాలకు కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇతర భాషల్లో కూడా ఇలాంటి సినిమాలకు క్రెజ్ ఎక్కువగానే ఉంటుంది.

తాజాగా ‘రథం’ అనే సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. గీతానంద్, చాందిని హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు చంద్రశేఖర్ కానూరి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం యొక్క టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. దాంతో ఈ టీజర్ చూసి హిందీ రైట్స్ కోసం భారీ గా ఆఫర్ చేశారట. సుకుమార్ పమ్మి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రాజా దరుపునేని నిర్మిస్తున్నారు. ఇంకా విడుదల కూడా కానీ ఈ చిత్రానికి భారీ ఆఫర్ రావడం విశేషమే.

Exit mobile version