“సలార్” తెలుగు హక్కులకు కూడా భారీ పోటీ.!

Published on Jun 10, 2023 8:07 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం కన్నా ముందు అయితే “ఆదిపురుష్” వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి ఇప్పుడు సిద్ధం అవుతుండగా ఈ సినిమా ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ మొత్తంలో బిజినెస్ ని జరుపుకోగా ఇక నెక్స్ట్ సలార్ కి కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తుంది.

మరి ప్రముఖ నిర్మాణ సంస్థలే ఈ హక్కుల కోసం పోటీ పడుతున్నాయట. మరి వీటిలో ఇప్పుడు ఆదిపురుష్ హక్కులు కొనుగోలు చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహా గీతా ఆర్ట్స్ లాంటి భారీ బ్యానర్ లు కూడా ఉన్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి సలార్ హక్కులు డీల్ ఇంతలో ఎవరికి ముగుస్తుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :