“వకీల్ సాబ్” డే 1 రికార్డులపై గట్టిగానే అంచనాలు.!

Published on Apr 8, 2021 4:00 pm IST

చాలా కాలం అయ్యిపోయింది తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఓ భారీ చిత్రం పది. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ ల చిత్రాలు “సరిలేరు నీకెవ్వరు”, “అల వైకుంఠపురములో” సినిమాలతో భారీ ఓపెనింగ్స్ సహా భారీ వసూళ్ల లెక్కలను తెలుగు ఇండస్ట్రీలో సెట్ చేసారు.

ఇక అక్కడ నుంచి మళ్ళీ తెలుగు బాక్సాఫీస్ దగ్గర తన పవర్ చూపేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత సన్నద్ధం అయ్యారు. ఇక పవన్ సినిమా వస్తుంది అంటే ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో అదురుతాయో తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇప్పుడు పవన్ చేసిన “వకీల్ సాబ్” రీమేక్ అయినప్పటికీ కూడా తన పవర్ స్టార్డం కి నిర్మాత దిల్ రాజు ప్రమోషన్స్ మరియు దర్శకుడు వేణు శ్రీరామ్ ప్లానింగ్ మరో లెవెల్ కి దీన్ని తీసుకెళ్లాయి. దీనితో మునుపటి పవన్ సినిమాలను మించే ఓపెనింగ్స్ రాబడుతుంది అని సినీ ట్రాకర్స్ సహా పవన్ అభిమానులు కూడా అనుకుంటున్నారు.

తాను చేసిన లాస్ట్ చిత్రం “అజ్ఞ్యాతవాసి” ఓపెనింగ్స్ పవన్ స్టార్డం కు అద్దం పట్టాయి. అయితే ఇప్పుడు కరోనా ఉన్నప్పటికీ కూడా అంతే స్థాయి ఓపెనింగ్స్ మళ్ళీ రాబట్టడం కన్ఫర్మ్ లా అనిపిస్తుంది. మరి చాలా కాలం అనంతరం వస్తున్న పవన్ చిత్రం తెలుగు రాష్ట్రాలు సహా ఓవరాల్ గా ఎలాంటి ఫిగర్స్ ను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :