“పుష్ప” హిందీ సాంగ్ పై మాత్రం మంచి అంచనాలున్నాయ్.!

Published on Aug 7, 2021 12:43 pm IST


ప్రస్తుతం సినీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” కోసం కూడా నడుస్తుంది. సుకుమార్ తో తీస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో మరిన్ని అంచనాలు ఈ చిత్రంపై ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి ప్రస్తుతం మ్యూజికల్ ఫెస్ట్ అప్డేట్స్ కోసం రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఒక్కోరోజు ఒక్కో భాషా ఫస్ట్ సింగిల్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే అన్ని భాషల కన్నా ఒకింత హిందీ సింగిల్ కోసం మ్యూజిక్ లవర్స్ లో మంచి అంచనాలు ఉన్నట్టుగా అర్ధం అవుతుంది. ముఖ్యంగా సింగర్ విశాల్ దద్లాని వాయిస్ లో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మాస్ బీట్ ఎలా ఉంటుందా అన్న దాని కోసమే బాగా ఎదురు చూస్తున్నారు అంతా..

దీనితో ఈ సాంగ్ హిందీలో కూడా పెద్ద చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం అని తెలుస్తుంది. మరి వీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే ఆగష్టు 13 వరకు ఆగాల్సిందే..

సంబంధిత సమాచారం :