లీక్డ్ వీడియో తో షారుఖ్ “జవాన్” పై పెరిగిన అంచనాలు!

Published on Mar 10, 2023 10:00 pm IST

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇటీవల విడుదలైన పఠాన్ సినిమా తో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్ లో ఇప్పటికే అన్ని రికార్డ్ లను చెరిపేసి, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా, మిగతా భారీ చిత్రాలకి సవాల్ విసిరింది. అయితే కింగ్ ఖాన్ హీరోగా నెక్స్ట్ సినిమా అట్లీ దర్శకత్వం లో జవాన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు. ఈరోజు ఈ చిత్రం నుండి ఒక చిన్న వీడియో క్లిప్ లీక్ అయ్యింది.

ఈ చిన్న వీడియో క్లిప్ షారుఖ్ ఖాన్ యొక్క యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉందో చూపిస్తుంది. ఈ వీడియో లో హీరో యాక్షన్ మోడ్ లో సిగార్ తాగుతూ కనిపించాడు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై అప్రమత్తమైన మేకర్స్ వీడియో ను కొద్ది సేపటికే డిలీట్ చేయించారు. ఈ చిత్రం లో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 2, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారీగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :