బాలయ్య “అఖండ” కి ఓవర్సీస్ లో భారీ వసూళ్లు!

Published on Dec 3, 2021 10:00 pm IST


నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలకృష్ణ సినిమా ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబడుతోంది.

ఓవర్సీస్ లో ఈ చిత్రం ప్రీమియర్స్ తో 332కే డాలర్స్ ను వసూలు చేయగా, మొదటి రోజు మిగతా 130 కే డాలర్స్ తో మొత్తం 462కే డాలర్స్ ను వసూలు చేయడం జరిగింది. 2021 లో ఒక తెలుగు సినిమా కి ఈ తరహా కలెక్షన్స్ రావడం ఇదే అని చెప్పాలి. ప్రస్తుతం ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్ వరకూ వన్ మిలియన్ మార్క్ చేరుకుంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అంతేకాక తెలుగు రాష్ట్రాల్లో అఖండ చిత్రం ప్రభంజనం కొనసాగుతోంది.

సంబంధిత సమాచారం :