ఏ జానర్లో సినిమా చేసి హిట్ కొట్టినా వచ్చే పాపులారిటీ కంటే మాస్ ప్రేక్షకులు మెచ్చే కమర్షియల్ సినిమా విజయంతో వచ్చే ఫేమ్ వేరుగా ఉంటుంది. ప్రస్తుతం స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వారంతా కమర్షియల్ సినిమాలిచ్చిన లిఫ్ట్ మీద ఎదిగినవారే. అందుకే మన యువ హీరోలు కమర్షియల్ చిత్రాల ద్వారానే ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నంలో ఒకటి రెండుసార్లు చేతులు కాలినా ఒక్క హిట్ కొడితే చాలు నిలబడిపోవచ్చు అనేది వాళ్ళ లెక్క.
ఈ లెక్కనే ఫాలో అయ్యాడు రామ్. పక్కా కమర్షియల్ సినిమాల మీద ఎక్కువ గురిపెట్టి పెద్ద దెబ్బలే తిన్న రామ్ చివరకు ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో గట్టి స్టాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రామ్ ను మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. మంచి మార్కెట్ క్రియేట్ చేసింది. అందుకే అయన తర్వాతి చిత్రం ‘రెడ్’కు మంచి హైప్ ఏర్పడింది.
ఈ సినిమా టైటిల్ ప్రకటన నిన్న సాయంత్రం జరగ్గా ఇప్పటికీ సోషల్ మీడియా టాప్ ట్రెండింగ్లో ఉంది.
ఇది కూడా పక్కా కమర్షియల్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. కిషోర్ తిరుమల ఈ చిత్ర దర్శకుడు. నవంబర్ 16నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. హైప్ చూస్తుంటే సినిమా బిజినెస్ రామ్ గత చిత్రాలకంటే భారీగానే జరిగేలా ఉంది. ఇక ప్రెక్షకులైతే ఇది కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ లెవల్లో అలరించాలని ఆశిస్తున్నారు.


