కార్తీ సినిమా కోసం భారీ జైల్ సెట్.!

Published on May 8, 2021 6:00 pm IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ ఈ ఏడాది “సుల్తాన్” సినిమాతో తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. మాస్ అండ్ కామెడీతో ఎంటర్టైన్ చేసిన కార్తి ఈసారి తన నెక్స్ట్ ఫిల్మ్ కి మరో స్ట్రింగ్ సబ్జెక్టును పట్టుకొస్తున్నట్టు అర్ధం అయ్యింది. అదే “సర్దార్”. కోలీవుడ్ దర్శకుడు పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులో కార్తీ ఓ రగ్గుడ్ లుక్ లో కనిపించాడు.

ఆ లుక్ కి సంబంధించిన మోషన్ పోస్టర్ టీజర్ ను కూడా మేకర్స్ వదిలారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రం కథానుసారం ఓ భారీ జైల్ సెట్ వెయ్యాల్సి ఉందట. అంతే కాకుండా అందులోనే చాలా మంది క్యాస్టింగ్ తో షూట్ ఉంటుందట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ప్రిన్స్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :