చై “కస్టడీ” లో సాంగ్ కి భారీ ప్లానింగ్స్.!

Published on Feb 16, 2023 1:55 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ బై లాంగువల్ చిత్రం “కస్టడీ”. కోలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మేకర్స్ ఇప్పుడు ఓ భారీ సాంగ్ ని అయితే ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం ఈ సాంగ్ షూట్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో తెరకెక్కిస్తుండగా కేవలం ఈ ఒక్క సాంగ్ కోసం మొత్తం 7 భారీ సెట్టింగ్స్ వేసారట. వీటిలో ఈ సాంగ్ ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. మరి ఈ క్రేజీ సాంగ్ అయితే విజువల్ గా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి మ్యాస్ట్రో ఇళయరాజా మరియు లిటిల్ మ్యాస్ట్రో యువన్ శంకర్ రాజా లు సంగీతం అందిస్తుండగా అరవింద స్వామి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ మే 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :