“ఇరుముడి” కి భారీ ప్రాఫిట్స్!?

“ఇరుముడి” కి భారీ ప్రాఫిట్స్!?

Published on Sep 3, 2026 10:33 AM IST

irumudi

మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ కలయికలో చేసిన సెన్సేషనల్ హిట్ చిత్రమే ఇరుముడి. విడుదలకి ముందే మంచి బజ్ ని ప్రపంచ వ్యాప్తంగా సొంతం చేసుకున్న ఈ సినిమా ఒక్కసారి విడుదల అయ్యాక వెనక్కి తిరిగి చూడలేదు. వరుస రికార్డుల వరద భారీ లాభాలతో ఇప్పటికీ ట్రెండ్ కొనసాగిస్తోంది.

అయితే ట్రేడ్ వర్గాల్లో ఇరుముడి ఏకంగా 100 కోట్ల లాభం చూస్తుంది అంటూ టాక్ ఒకటి వైరల్ గా మారింది. సినిమాకి జరిగిన బిజినెస్ కి వస్తున్న షేర్ లెక్కలు చూస్తే దాదాపు ఈ మాట వాస్తవమే అనుకోవాలి. సో మొత్తంగా రవితేజకి అలాగే మైత్రి మూవీ మేకర్స్ కి భారీ లాభాలే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించింది. అలాగే జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

తాజా వార్తలు