రీసెంట్ గా అనౌన్స్మెంట్ తోనే సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన సినిమానే అని చెప్పాలి. మరి ఈ సినిమా అనౌన్స్ చేస్తూ ఒక యానిమేషన్ గ్లింప్స్ ని వదిలారు. ఊక ఇందులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ స్కోర్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది. తన మార్క్ రిపీట్ వాల్యూ ఉన్న బీట్స్ ఇచ్చేసరికి సోషల్ మీడియాలో ఈ క్లిప్ ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.
ఇక ఇన్స్టాగ్రామ్ లో అయితే ఏకంగా హాఫ్ మిలియన్ రీల్స్ కి రీచ్ అయ్యి ఒక థీమ్ ఓ ఎస్ టి కి రికార్డ్ సెట్ చేసింది. ఇదంతా చాలా తక్కువ సమయంలోనే కావడం విశేషం. ఇంకా సినిమా పట్టాలెక్కకుండానే ఈ సినిమాకి ఈ రేంజ్ లో హైప్ వచ్చింది. ఇక సినిమా మొదలై లోకేష్ కనగరాజ్ మార్క్ కంటెంట్ ఒకొకటి బయటకి వస్తే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని ఆపడం కష్టమే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఇతర డీటెయిల్స్ ముందు రానున్నాయి.
Instagram has turned red and is flooded with the #AA23 Theme reels 🔥🔥
500K+ REELS and counting for the #23Theme on Instagram 💥💥
ICYM the #AA23 Announcement Video.
▶️ https://t.co/AGCi8q89x2Icon Star @alluarjun @Dir_Lokesh @MythriOfficial @anirudhofficial
STRIVE FOR… pic.twitter.com/OQTIODakox
— Mythri Movie Makers (@MythriOfficial) January 31, 2026


