కుడి ఎడమైతే వెబ్ సిరీస్ కి ఊహించని రీతిలో రెస్పాన్స్!

Published on Jul 28, 2021 3:30 pm IST


తెలుగు లో వెబ్ సిరీస్ లు మెల్లమెల్లగా వస్తున్నాయి థియేటర్లు మూత పడటంతో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా ఈ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. అయితే పవన్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన కుడి ఎడమైతే వెబ్ సిరీస్ కి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఆహా వీడియో లో విడుదల అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఐఎండీబీ రేటింగ్స్ లో కుడి ఎడమైతే టాప్ లో నిలిచింది. 12.5 ఓటింగ్ శాతం తో ముందు వరుస లో నిలిచింది.

అయితే ఈ తరహ లో రెస్పాన్స్ రావడం పట్ల వెబ్ సీరీస్ టీమ్ సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే టైమ్ లూప్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటి అమలా పాల్, రాహుల్ విజయ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :