విజయ్ దేవరకొండ “ఖుషి” ఫస్ట్ లుక్ కి విశేష స్పందన!

Published on May 17, 2022 9:03 am IST

విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఖుషి. ఈ చిత్రం టైటిల్ తో పాటుగా, ఫస్ట్ లుక్ మరియు రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. విజయ్ మరియు సమంత పెయిర్ పై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ తో నే క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం డిసెంబర్ 23, 2022 న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం లో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టైటిల్ తోనే క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :