మహేష్ సినిమా కోసం భారీ సెట్ వర్క్స్.?

Published on May 19, 2021 3:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్ల సహా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఆల్రెడీ పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ స్టార్ట్ అయ్యి కొంత మేర షూట్ ను కూడా జరుపుకుంది. ఇక ఇదిలా ఉండగా త్రివిక్రమ్ తో సినిమా పై లేటెస్ట్ ఇన్ఫో కూడా వినిపిస్తుంది.

ఆల్రెడీ ఈ చిత్రంకు ముహూర్తం కుదరగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయట. ఇక వీటితో పాటుగా ఈ చిత్రంలో పలు సాలిడ్ సెట్ వర్క్స్ కూడా చూస్తామట. మామూలుగా త్రివిక్రమ్ సినిమాల్లో ఫ్యామిలీ రిలేటెడ్ సెట్స్ అధికంగానే కనిపిస్తాయి. అలా ఈ సినిమా కోసం కూడా పలు భారీ సెట్టింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :