ప్రభాస్ 20 కోసం భారీ సెట్స్ !

Published on Mar 31, 2019 9:56 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో తో పాటు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తన 20 వచిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈచిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఇటలీ లో పూర్తవ్వగా తాజాగా రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ కోసం ఏకంగా 18 భారీ సెట్స్ ను నిర్మిస్తున్నాడు ఆర్ట్ డైరెక్ట్ రవీందర్ రెడ్డి . ఈ సెట్స్ తో ఆయన రోమ్ నగరాన్ని హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడం తో ఒక్కో సెట్ కు భారీ గా ఖర్చు చేస్తున్నారు. గోపికృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :

More