మొత్తానికి మంచి ఆఫరే పట్టిండు !

Published on Feb 26, 2019 8:34 pm IST

యువతను టార్గెట్ చేసుకుని ‘హుషారు’ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించి బాక్సాఫీస్ పరంగా హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీ హర్ష కోనుగంటి. ఆ సినిమా గురించి పెద్దగా హడావుడి కనిపించకపోయినా బీసీ సెంటర్ల ప్రేక్షకుల నుండి మాత్రం మంచి రెస్పాన్స్ నే తెచ్చుకుంది ఈ చిత్రం. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబట్టి బాగానే లాభాలను గడిచింది. అందుకేనేమో శ్రీ హర్ష కోనుగంటికు బాగానే అవకాశాలు వస్తున్నాయి.

అయితే హర్ష కోనుగంటి మాత్రం తన రెండో సినిమాని ‘విజయ్ దేవరకొండ’తో ప్లాన్ చేస్తున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోతో రెండో సినిమా చేసే అవకాశాన్ని అందుకోవడం.. పైగా ఓ పెద్ద బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉండటంతో శ్రీ హర్ష కోనుగంటి మొత్తానికి మంచి ఆఫర్ పట్టిండు అని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం :