అనుమతి నిరాకరణ..’జార్జ్ రెడ్డి’కి పెరుగుతున్న క్రేజ్

Published on Nov 17, 2019 8:52 am IST

జీవన్ రెడ్డి డైరెక్షన్లో రూపొందిన ‘జార్జ్ రెడ్డి’ చిత్రం ఈ నెల 22న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఈరోజు 17వ తేదీన హైదరాబాద్ నగరంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ప్రీరిలీజ్ వేడుక జరపనున్నట్లు ఇన్ని రోజులు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో సినిమాపై యువతలో ఆసక్తి మొదలైంది.

కానీ పవన్ వేడుకకు హాజరైతే యువత, స్టూడెంట్ యూనియన్స్ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని పోలీసులు అనుమతులు నిరాకరించినట్టు నిన్న రాత్రి నుండి వార్తలు మొదలయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ నడుస్తోంది. అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో సినిమాకు విపరీతమైన ప్రచారం లభిస్తోంది.

కానీ చిత్ర యూనిట్ కానీ పవన్ వ్యక్తిగత సిబ్బంది కానీ ఈ విషయమై ఇంకా స్పందించలేదు. విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని మైక్‌ మూవీస్‌ బ్యానర్‌తో కలిసి త్రీ లైన్స్‌, సిల్లీ మాంక్స్‌ స్టూడియో సంయుక్తంగా నిర్మించాయి. ‘వంగవీటి’ ఫేం సందీప్‌ మాధవ్‌ (సాండి) ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషించాడు.

సంబంధిత సమాచారం :

X
More