వర్మ ఓవర్ యాక్షన్ కి పోలీస్ ల రియాక్షన్ అదిరిందిగా…!

Published on Jul 21, 2019 9:28 am IST

ముగ్గురు దర్శకులు ఒకే బైక్ పై పబ్లిక్ లో వెళుతూ హైదరాబాద్ రోడ్ల పై సందడి చేశారు. వారిలో ఒకరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ,కాగా మరొకరు ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి, మరొకరు లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు అగస్త్య. వీరు ముగ్గురు మాస్ గెట్ అప్స్ లో ఒకే బైక్ పై వెళుతూ ఉంటె గుర్తుపట్టినవారు కొందరు ఫోటోలు తీశారు.

ఐతే ఓ వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వర్మపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు ఫేస్‌బుక్‌ ద్వారా పంపి ఫిర్యాదు చేశారు.దీనికి స్పందించిన పోలీస్లు ట్రిపుల్‌ రైడింగ్‌కు రూ.1200, హెల్మెట్‌ లేనందుకు రూ.135, మొ త్తంగా రూ.1335 జరిమానాను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు విధించారు. అయితే, పోలీసులు జారీ చేసిన ఈ చలానా బైక్‌ యజమాని బడ్డె దిలీప్‌కుమార్‌కు వెళ్లిందని సమాచారం.

సంబంధిత సమాచారం :