“సర్కారు వారి పాట” ఫస్ట్ లుక్ పై పెరుగుతున్న హైప్.!

Published on May 21, 2021 7:05 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మాస్ మసాలా చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికి కొంత మేర షూట్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చెయ్యడానికి రెడీగా ఉంది.

ఇక ఇదిలా ఉండగా ఈ వచ్చే మే 31న మహేష్ తండ్రి కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరి దాని కోసం మహేష్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియా అంతా హంగామా చేస్తున్న వారు ఈ లుక్ పై మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నారు.

గత చిత్రాల్లా కాకుండా సరికొత్త లుక్ మరియు మెకోవర్ లో దానిని ఆశిస్తున్నారు. మరి అందుకు తగ్గట్టుగానే ఒక పవర్ ఫుల్ మాస్ మోస్ట్ పోస్టర్ లోడ్ అవుతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. అందుకే ఈ పోస్టర్ పై మరింత హైప్ కూడా పెరుగుతుంది. మరి ఈ మాస్ ట్రీట్ ఎలా ఉండనుందో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :