యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తున్న హైపర్ ఆది స్కిట్

యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తున్న హైపర్ ఆది స్కిట్

Published on Apr 24, 2020 1:57 PM IST

జబర్ధస్త్ కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్స్ కి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన స్కిట్స్ లో ఆద్యంతం నాన్ స్టాప్ పంచెస్ తో నవ్వించడం ఆది ప్రత్యేకత. కేవలం కొద్ది గంటల్లోనే ఆది స్కిట్స్ కి యూట్యూబ్ లో మిలియన్స్ హిట్స్ అందుకుంటాయి. తెలుగు వారు ఎక్కడున్నా సరే ఆది స్కిట్లకు ఒక ప్రత్యేక క్రేజ్ ఉంది..ఈటీవీ టాప్ షో జబర్ధస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో అనేక సినిమాలలో కమెడియన్ గా కూడా బిజీ అయ్యారు.

కాగా 2017 సంక్రాంతి సందర్భంగా ఈటీవీ ఛానెల్లో ప్లాన్ చేసిన ఈవెంట్ లో ఆది చేసిన ఓ స్కిట్ యూ ట్యూబ్ లో సంచలనం రేపుతోంది. “సంక్రాంతి పందెం కోళ్లు” పేరుతో సంక్రాంతి పండుగకు ప్లాన్ చేసిన ఈవెంట్ లో ప్రసారం అయిన ఆది స్కిట్ ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా ఇప్పటి వరకు 60మిలియన్ వ్యూస్ దక్కించుకొని రికార్డు నెలకొల్పింది. శేఖర్ మాస్టర్, రోజా జడ్జెస్ గా ఉన్న ఈ స్కిట్ లో ఆది తన టీమ్ మెంబర్స్ తో పాటు, సుడిగాలి సుధీర్ తో కలిసి చేశారు. ఈ స్కిట్ లో శేఖర్ మాస్టర్ కుమారుడు కూడా ఓ రోల్ చేయడం విశేషం.

ఆ హైపర్ ఆది స్కిట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు