పెద్ద మొత్తానికి అమ్ముడైన ‘హైపర్’ హిందీ హక్కులు

hyper
‘నేను శైలజా’ వంటి మంచి విజయం తరువాత హీరో రామ్ చేస్తున్న చిత్రం ‘హైపర్’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తాలూకు ట్రైలర్లు, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకంటూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సినీ సర్కిల్స్ లో కూడా ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో ఈ సినిమా యొక్క హిందీ హక్కులు పెద్ద మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది. బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఈ హక్కులను రూ. 2 కోట్లు వెచ్చించి కొనుక్కుందట.

విడుదలకు ముందే సినిమా లాభాల బాట పట్టడంతో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు చాలా హ్యాపీగా ఫీలవున్నారు. ఇకపోతే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 30న విడుదలకానుంది. ఘిబ్రన్ సంగీతం అందించిన ఈ సినిమాలో రామ్ కు జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది.