గ్లామర్ రోల్స్ కి నేనెప్పుడూ సిద్దమే – స్వాతి

గ్లామర్ రోల్స్ కి నేనెప్పుడూ సిద్దమే – స్వాతి

Published on Nov 3, 2015 11:00 AM IST

swathi
కలర్స్ అనే ప్రోగ్రాంతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరై ఆ ప్రోగ్రాం పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న హీరోయిన్ స్వాతి. ఆ తర్వాత బుల్లి తెర నుంచి వెండితెరకి ప్రమోషన్ అందుకున్న స్వాతి తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంది. తాజాగా స్వాతి టైటిల్ రోల్ లో చేసిన సినిమా ‘త్రిపుర’. హర్రర్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమా నవంబర్ 6వ తేదీన ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తోంది. ఈ సినిమా సక్సెస్ పై స్వాతి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

ఇది పక్కన పెడితే.. స్వాతి మొదటి నుంచి చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ, ఎక్కువగా హోమ్లీ లుక్ పాత్రల్లోనే కనిపిస్తోంది. దాంతో రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో మీరు గ్లామర్ రోల్స్ ని దూరమా అని అడిగితే ‘నేను గ్లామర్ రోల్స్ కి ఎప్పుడూ దూరంగా లేను, కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ తరహా పాత్రలకి, మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించడానికి నేనెప్పుడూ సిద్దంగానే ఉన్నాను. నా ప్రకారం వల్గర్ గా లేనంత వరకూ ఎంత గ్లామర్ గా అయినా కనిపించవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే నా దగ్గరి వచ్చే కథలు, అవకాశాలు అన్నీ హోమ్లీ లుక్ ఉన్న పాత్రలే రావడం వలన గ్లామర్ డాల్ రోల్స్ లో కనిపించలేకపోయానని’ స్వాతి సమాధానం ఇచ్చింది.

గీతాంజలి ఫేం రాజ్ కిరణ్ దర్శకత్వంలో వస్తున్న ఈ త్రిపుర సినిమాలో నవీన్ చంద్ర ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తాడు.

తాజా వార్తలు