తారక్ నటన ముందు నేను నిలబడలేను – విశాల్

తారక్ నటన ముందు నేను నిలబడలేను – విశాల్

Published on Oct 28, 2018 10:50 AM IST

ఎన్టీఆర్- పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ‘టెంపర్’ సినిమా వరుస ప్లాప్ లతో సతమవుతున్న ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా అని తెలిసిన విషయమే. అయితే ఈ చిత్రం తమిళ్ రీమేక్ లో విశాల్ మరియు రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే కీలక షెడ్యూల్ ను పూర్తీ చేసుకున్న ఈ చిత్రం చాలా బాగా వస్తుందట. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య సాగే కొన్ని సన్నివేశాలు బాగా అలరిస్తాయని చెబుతుంది చిత్రబృందం.

కాగా తాజాగా విశాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాని తెలుగులో డబ్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే.. తెలుగులో రిలీజ్ చేస్తే తారక్ పెర్ఫార్మెన్స్ తో, నా పెర్ఫార్మెన్స్ ని పోలుస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ నటన ముందు, నేను నిలబడలేను. అందుకే ఈ సినిమాని తెలుగులోకి తీసుకురావట్లేదు’ తెలిపారు.

ఎ.ఆర్ మురుగదాస్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘అయోగ్య’ అనే పేరు పెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు