హోమ్ బ్యానర్లో నటించనంటున్న నాని !

హోమ్ బ్యానర్లో నటించనంటున్న నాని !

Published on Feb 14, 2018 4:00 PM IST

దర్శకత్వ శాఖలో పనిచేస్తూ హీరోగా మారి వరుస హిట్లతో విజయంవతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న నాని ఇప్పుడు ఇప్పుడు నిర్మాతగా టర్న్ తీసుకుని నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మతో ‘అ !’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 16న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా అభిమానులతో ఇంటరాక్ట్ అయినా నాని తన సొంత నిర్మాణ సంస్థలో ఎప్పుడూ నటించబోనని అన్నారు.

అంతేగాక ఇకపై రెగ్యులర్ గా సినిమాలు నిర్మిస్తూ ఉంటానని, మంచి కథలు, టాలెంట్ ఉన్న దర్శకులకు ఎప్పుడూ తన వద్ద అవకాశం ఉంటుందని, బ్యాక్ గ్రౌండ్, అనుభవం వంటి విషయాల్ని అస్సలు పట్టించుకోకుండా ఎవరితోనైనా సినిమాలు చేస్తానని అన్నారు. అలాగే ‘అ !’ ఫైనల్ కట్ ఈరోజు ఉదయమే చూశానన్న నాని చిత్రం చాలా బాగా వచ్చిందని, ప్రశాంత్ వర్మ గొప్పగా డైరెక్ట్ చేశారని అన్నారు.

కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ వంటి స్టార్ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రంలో హర్రర్, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్, కామెడీ వంటి అనేక జానర్లు ఉండనున్నాయట.

తాజా వార్తలు