విక్రమ్ మరియు అమీ జాక్సన్ లు జంటగా నటిస్తున్న ‘ఐ’ సినిమా విడుదలతేదిలో స్పష్టత లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో మంచి బిజినెస్ ను సంపాదిస్తుంది. యువకులలో ఈ సినిమాపై భీభత్సమైన క్రేజ్ దీనికి కారణమని తెలుస్తుంది. అందుకే పంపిణీదారులు ఈ చిత్రంకోసం ఎక్కువ మొత్తం కేటాయిస్తున్నారు
నిజాం తరువాత కృష్ణ, గుంటూరు హక్కులు కూడా దాదాపు 5.75 కోట్లకు సొంతం చేసుకున్నారు. డబ్బింగ్ సినిమాలకు ఇదికనీవిని ఎరుగని ధర కావడం విశేషం. ఈ ధర కారణంగా మిగిలిన ఏరియాలలో బిజినెస్ ఆసక్తికరంగా మారనుంది.
శంకర్ క్రియేటివ్ బుర్రకి గ్రాఫిక్స్ మాయాజాలాన్ని ఎలాగో కలపనున్నాడు. విక్రమ్ బీస్ట్ పాత్ర ప్రధాన ఆకర్షణ కానుంది. రెహమాన్ అందించిన స్వరాలు ఇప్పటికే తమిళ మార్కెట్ ను ఊపేస్తున్నాయి. గ్రాఫిక్స్ బాధ్యతను న్యూజిల్యాండ్ కి చెందినా వేటా స్టూడియోస్ సంపాదించుకుంది.


