ఆయన మేనరిజమ్ ఫాలో అయ్యాను – ధనుష్

Published on Jun 14, 2021 1:00 am IST

‘ధనుష్’ తానూ ఒక హీరో అనే స్టేటస్ కంటే కూడా, తానూ ‘సూపర్ స్టార్ రజినీకాంత్’ అల్లుడిగానే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారట. పైగా చిన్నప్పటి నుండి రజిని అభిమాని. పైగా ఇప్పుడు అల్లుడు. అయినా, ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఎప్పుడూ రజినీకాంత్ ని అనుకరించలేదు. దర్శకులతో పాటు అభిమానులు ఎంత ఒత్తిడి చేసినా రజిని స్టైల్ ను తానూ ఫాలో అవ్వలేను అంటూ ధనుష్ మ్యానేజ్ చేస్తూ వచ్చాడు.

కానీ, ఇప్పుడు అనుకరించారు. ధనుష్ మాటల్లోనే.. ‘నేను, నా సినిమాల్లో రజినీకాంత్ గారి మేనరిజమ్ ను మొదటి సారి ఫాలో అవ్వాల్సి వచ్చింది. నా ‘జగమే తందిరం’ సినిమాలో ఈ సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఎలాగైనా రజినీకాంత్ గారి మేనరిజమ్ ను ఈ సినిమాలో వాడుదామని బలవంతం పెట్టడంతో అతని మాటను కాదనలేక నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది’ అంటూ ధనుష్ తెలియజేశాడు. ఇక ఈ “జగమే తందిరం” తమిళ చిత్రం ఈ నెల 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :