‘ధృవ’లో చరణ్, అరవింద్ స్వామి తర్వాత నాదే కీ రోల్!

5th, October 2016 - 04:24:00 PM

Posani-Krishna-Murali
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ధృవ’ పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్‍ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కొద్దినెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. మొదట ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ నెలలోనే విడుదల చేయాలని టీమ్ భావించినా, అన్ని పనులూ అప్పటికి పూర్తయ్యే అవకాశం కనిపించకపోవడంతో డిసెంబర్‍కు వాయిదా పడింది. ఏదేమైనా సినిమాపై ఉన్న అంచనాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే పోతున్నాయి.

తాజాగా ధృవ సినిమా గురించి మాట్లాడుతూ అందులో ఓ కీలక పాత్రలో నటించిన పోసాని కృష్ణమురళి రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. తండ్రి చిరంజీవి లాగానే రామ్ చరణ్ కూడా ఉన్నతంగా మాట్లాడతాడని, చరణ్ హీరోగా నటిస్తోన్న ధృవ, ఆయన తండ్రి చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం. 150 రెండు సినిమాల్లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగానే ధృవ సినిమాలో తన రోల్ గురించి చెబుతూ చరణ్, అరవింద్ స్వామి తర్వాత సినిమాలో ఆ స్థాయి వెయిట్ ఉన్న పాత్ర తనదేనని పోసాని అన్నారు. ధృవలో పోసాని ఓ పొలిటీషియన్‌గా కనిపించనున్నారు.