చిరంజీవిగారి ప్రేరణతో డాన్స్ నేర్చుకున్నా – రోహిత్ నంద‌న్

చిరంజీవిగారి ప్రేరణతో డాన్స్ నేర్చుకున్నా – రోహిత్ నంద‌న్

Published on Jan 18, 2021 11:50 AM IST

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న రోహిత్ నంద‌న్ – ల‌డిల‌డి సాంగ్ సింగిల్ నో ఐడియా ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం యంగ్ హీరో రోహిత్ నంద‌న్, ఇంటర్నెట్ సెన్సేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ జంట‌గా రూపొందిన ల‌డిల‌డి అనే పాట తాజాగా విడుద‌లై అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌క‌లు నుంచి విశేషాద‌ర‌ణ అందుకుంటుంది. ఈ మాసీ నెంబ‌ర్ ని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు శ్రీచ‌ర‌ణ్ పాకాల కంపోజ్ చేశారు, అలానే బిగ్ బాస్ 3 విన్న‌ర్, హ్యాపేనింగ్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ ఈ పాట‌ను ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట య్యూటూబ్ తో పాటు ఇత‌ర సంగీత మాధ్య‌మాలు ద్వారా శ్రోత‌ల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

ఈ సంద‌ర్భంగా యువ న‌టుడు రోహిత్ నంద‌న్ మాట్లాడుతూ తాను మెగాస్టార్ చిరంజీవిగారిని ఆద‌ర్శంగా తీసుకుని డాన్స్, న‌ట‌న త‌దిత‌ర సినిమా విభాగాల్లో శిక్ష‌ణ తీసుకున్న‌ట్లుగా తెలిపారు. లాక్ డౌన్ స‌మ‌యంలో త‌న స్నేహితుడు శ్రీచ‌ర‌ణ్ పాకాల‌తో క‌లిసి ఈ ల‌డిల‌డి అనే పాటకు సంబంధించిన కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేసి ఆ త‌రువాత ఆయ‌న సూచ‌న‌లు ద్వారా ఈ ఆల్బ‌మ్ లోకి ఇంట‌ర్నెట్ సెన్షేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ను, ప్ర‌ముఖ సింగ‌ర్ రాహుల్ సిప్లీగంజ్ ని, తీసుకున్నామ‌ని అన్నారు రోహిత్ నంద‌న్ అన్నారు.

ఈ పాట‌ను ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘు మాస్ట‌ర్ త‌న డాన్సింగ్ స్కిల్స్ తో, లిరిక్ట్ రైట‌ర్ విస్సాప్ర‌గ‌డ త‌న రైటింగ్ తో మ‌రో లెవెల్ కి తీసుకెళ్లార‌ని, ఈ పాట ద్వారానే ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తెలుగు చిత్రీ సీమ‌లోకి అడుగుపెట్టార‌ని, ఆమె ఈ పాట‌లో ఆడ‌ట‌మే కాదు పాడ‌టం కూడా జ‌రిగంద‌ని రోహిత్ తెలిపారు. తొలిసారిగా తాను చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని తెలుగు ఆడియెన్స్ విశేషంగా ఆద‌రించ‌డం, యూట్యూబ్ లో ఈ పాట‌కు మిలియ‌న్ పైగా వ్యూస్ రావ‌డం తన‌కు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని రోహిత్ నంద‌న్ తెలిపారు. తాను త్వ‌ర‌లోనే హీరోగా ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో తెలుగు చిత్ర సీమ‌లోకి ఎంట్రీ ఇస్తున్నాని రోహిత్ అన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌ణ త్వ‌ర‌లోనే రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు