ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – ఆ నిర్మాత నాకు నరకం చూపెట్టాడు !

15th, February 2018 - 04:54:45 PM

యంగ్ హీరో సందీప్ కిషన్ చేసిన నూతన చిత్రం ‘మనసుకు నచ్చింది’. మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులు మీ కోసం..

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో నా పేరు సూరజ్. వాస్తవంగా నేను మిడిల్ క్లాస్ అబ్బాయిని. కానీ సినిమాలో మాత్రం డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టిన కుర్రాడిలా కనిపిస్తాను. అంటే దేన్నీ పెద్దగా పట్టించుకోకుండా లైట్ గా తీసుకుంటుంటాను.

ప్ర) సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) కొన్ని సినిమాల్ని కథలు నడుపుతాయి. ఇంకొన్ని సినిమాల్ని మూమెంట్స్ నడుపుతుంటాయి. ఈ సినిమా కూడా అందమైన మూమెంట్స్ తో నడిచే సినిమా.

ప్ర) ఈ సినిమా మీకెలా ప్రత్యేకం అనొచ్చు ?
జ) ఇందులో ప్రతి సన్నివేశం చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇలాంటి పాత్రను, కథను నేనింతవరకు చేయలేదు. అందుకే నాకీ సినిమా స్పెషల్. ప్రేక్షకులంతా నన్ను ఒక కొత్త కోణంలో చూస్తారు.

ప్ర) మంజులగారి దర్శకత్వం ఎలా ఉంది ?
జ) చాలా బాగా చేశారు. ఎవరైనా చెప్పిన కథను చెప్పినట్టే స్క్రీన్ మీకు తీసుకురావడం అరుదుగా జరిగే విషయం. కానీ మంజులగారు మాత్రం చెప్పింది చెప్పినట్టే తీశారు.

ప్ర) ఈ సినిమా వలన ప్రకృతి పట్ల మీ అభిప్రాయం మారిందా ?
జ) మారింది. ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఎక్కువగా లైఫ్ ను ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ప్రతి మంచి సందర్భాన్ని ఆస్వాదిస్తున్నాను.

ప్ర) మీ గత ఫైల్యూర్స్ కి కార్బన్ ఏంటో కనుకున్నారా ?
జ) నేను మొదట్లో ఫన్ ఉండే సినిమాలు చేశాను. అవి సక్సెస్ అయ్యాయి. కానీ మధ్యలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేశాను. వాటిలో ఫన్ ఎక్కువగా ఉండదు. అందుకే అందరికీ కనెక్ట్ కాలేక విఫలమయ్యాయి.

ప్ర) అయితే రేపు రాబోయే సినిమలో ఫన్ ఉంటుందా ?
జ) చాలా ఉంటుంది. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. చిన్న పిల్లల దగ్గర్నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ కలిస్ కూర్చుకుని చూసే సినిమా ఇది.

ప్ర) మహేష్ బాబుగారు సినిమా చూశారా ?
జ) పూర్తిగా చూడలేదు. కొన్ని రషెస్ చూశారు. బాగుందన్నారు. మొదటిరోజు కుటుంబంతో కలిసి చూస్తానని అన్నారు.

ప్ర) ఆ మధ్య నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎస్.కె.బషీద్ మీపై విమర్శలు చేశాడు. వాటిపై మీరు పెద్దగా స్పందించలేదు ?
జ) అనవసరమైన వాళ్ళందరి విమర్శలకు స్పందించడం ఎందుకని వదిలేశాను. రూ. 3 కోట్లకి ప్రమోషన్స్ చేశానని చెప్పి ఒక్క హోర్డింగ్ కూడా పెట్టలేదు. జైలుకెళ్ళొచ్చాడు, నిర్మాతల కౌన్సిల్ నుండి సస్పెండ్ అయ్యాడు. నిర్మాతలకి డబ్బులు కట్టకుండానే సెన్సార్ కాపీని తీసుకొచ్చి రిలీజ్ చేశాడు. అది పెద్ద మోసం. కనీసం తెలుగు టైటిల్స్ కుడా వేయలేదు. ఆ సినిమాను బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసి ఉంటే నాకో మంచి హిట్ దక్కేది. కానీ అతని వల్ల పోయింది. అతని మూలంగా నరకం చూశాను.

ప్ర) మీ నెక్స్ట్ సినిమాలేంటి ?
జ) కార్తిక్ ఘట్టమనేనితో ఒక సినిమా ఉంది. నందిని అనే లేడీ డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తాను. కునాల్ కోహ్లీ సినిమా పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇవి కాకుండా తమిళంలో కార్తీక్ నరేన్ తో ‘నరగసూరన్’ అనే సినిమా చేస్తున్నాను.