
విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన విజువల్ వండర్ ‘ఐ’. ఏఅర్ రెహమాన్ స్వరపరిచిన తెలుగు పాటల్ని డిసెంబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. మొదట 10వ తేదిన విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తేది మార్చారట.
హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం ఆడియో విడుదల కార్యక్రమానికి ముస్తాబవుతుంది. చైనీస్ సూపర్ స్టార్ జాకీచాన్ తో పాటు తెలుగులో అగ్ర హీరోలు హాజరవుతున్నట్టు సమాచారం. అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే విడుదలయిన తమిళ ఆడియో శ్రోతలను అలరిస్తుంది.
మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై తెలుగులో ఈ సినిమాను అనువదిస్తున్నారు. ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు ‘ఐ’ సినిమాకు పని చేస్తున్నారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

