‘ఐ’ రిలీజ్ పై వీడని సస్పెన్స్

i-poster1
సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ మూవీ ‘ఐ’. ఇటీవలే హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ చేతుల మీదుగా ఐ సినిమా తమిళ్ ఆడియోని రిలీజ్ చేసారు. ఆ టైంలో ఈ సినిమా దీపావళికి రిలీజ్ అవుతుందని అన్నారు. కానీ ప్రస్తుతం టెక్నికల్ సమస్యల వల్ల ఈ సినిమాని వాయిదా పడినట్లు అంటున్నారు. కానీ ఎప్పుడు రిలీజ్ చేయనున్నాం అని పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయడం లేదు.

అలాగే ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆడియోని దసరా కానుకగా రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ అది కూడా వాయిదా పడింది. ఆ విషయంపై కూడా కచ్చితమైన ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇప్పటికే ఈ ట్రైలర్ కి వచ్చిన భారీ రెస్పాన్స్ తో ఆడియన్స్ అంతా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర టీం నవంబర్ అంటున్నారు కానీ రిలీజ్ డేట్ మాత్రం ఫైనలైజ్ అవ్వలేదు.

విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా కనిపించనుంది. సుమారు 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కి ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version