‘చిరంజీవి, నాగార్జున’గార్లను డైరెక్ట్ చేయాలన్నదే నా కోరిక !

Published on Mar 28, 2019 5:22 pm IST

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కాంచన 3’. కాగా ఏప్రిల్ 19వ తేదీన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలకానుంది. అయితే తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. మునికి తీసిన అన్ని పార్ట్ లు సూపర్ హిట్ అవడం థ్రిల్లింగ్ గా ఉంది. ఇప్పుడు 4వ పార్ట్ గా వస్తున్న కాంచన 3 కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. దేవుని అనుగ్రహంతో, ప్రేక్షకుల ఆదరణతో 10 పార్ట్ ల వరకు తీయలనేది నా బలమైన కోరిక అని అన్నారు.

అలాగే ఆయన చిరంజీవి, నాగార్జున గురించి మాట్లాడుతూ.. నన్ను పెద్ద డాన్స్ మాస్టర్ని చేసిన మెగాస్టార్ చిరంజీవిగారితో ఒక సినిమా, నన్ను ‘మాస్’ తో డైరెక్టర్ ని చేసిన కింగ్ నాగార్జున గారితో ఒక సినిమా డైరెక్ట్ చేయాలనేది నా కల అని చెప్పుకొచ్చారు.

ఇక రాఘవ లారెన్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. కేరళ వరదలు వచ్చిన సమయంలో కూడా కోటి రూపాయిలు భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కాగా తన సేవ గురించి లారెన్స్ మాట్లాడుతూ.. 160 మంది చిన్న పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించాను. నా ట్రస్ట్ ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను. అని అన్నారు.

సంబంధిత సమాచారం :

More