ఇంటర్వ్యూ : నాని – నేను సంపాదించిన ప్రతి రూపాయిని ఇండస్ట్రీలోనే పెడతాను !

ఇంటర్వ్యూ : నాని – నేను సంపాదించిన ప్రతి రూపాయిని ఇండస్ట్రీలోనే పెడతాను !

Published on Feb 15, 2018 3:51 PM IST

రేపు శుక్రవారం విడుదలకానున్న చిత్రాల్లో నాని నిర్మించిన ‘అ !’ కూడ ఒకటి. ఈ విడుదల సందర్బంగా నాని మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా రిలీజ్ పట్ల టెంక్షన్ ఉందా ?
జ) ఉందండీ. నేను హీరోగా చేసిన మొదటి సినిమా విడుదలైనప్పుడు ఎలాంటి కంగారైతే పడ్డానో ఈ సినిమాకి కూడా పరిస్థితి అలానే ఉంది. రిలీజ్ టెంక్షన్ ప్రతి సినిమాకి ఉండేదే. కానీ ఈ సినిమాకి కొద్దిగా ఎక్కువగా ఉంది.

ప) ‘అ !’ ఎలా ఉండబోతోంది ?
జ) ‘అ !’ చాలా కొత్తగా ఉండబోతోంది. ఇందులో రెగ్యులర్ రొటీన్ అంశాలేవీ ఉండవు. అన్ని రకాల ఎమోషన్స్ కలగలిసి ఉంటాయి. సినిమా చూసిన వాళ్ళు థియేటర్లోంచి ఆశ్చర్యపోతూ బయటికొస్తారు.

ప్ర) మొదటి సినిమానే ఇంత ప్రయోగాత్మకంగా చేశారు. రిస్క్ అనిపించలేదా ?
జ) రిస్క్ అనుకుంటే ఏ పని చేయాలన్న భయపడుతూనే ఉంటాం. అందుకే రిస్క్ గురించి ఆలోచించకుండా ఒక భిన్నమైన ప్రయత్నం చేస్తే బాగుంటుందని చేశా.

ప్ర) కమర్షియల్ గా ఎంతవరకు వర్కవుట్ అవుతుంది ?
జ) చెప్పాలేను. అయినా ఈ సినిమాని డబ్బుల కోసం చేయలేదు. అందుకే వేరే వాళ్ళని రిస్కులో పెట్టడం ఇష్టంలేక నేనే రిలీజ్ చేస్తున్నాను. నేను ప్రతి రూపాయి ఇండస్ట్రీలోనే సంపాదించాను. కాబట్టి ప్రతి రూపాయిని ఏదో ఒక రూపంలో ఇక్కడే పెట్టాలి అనేది నా ఆలోచన.

ప్ర) ఈ సినిమా అందరికి నచ్చుతుందని చెప్పగలరా ?
జ) అందరికీ నచ్చుతుందని చెప్పలేను. ఇది కమర్షియల్ సినిమా కాదు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. కానీ కొత్తదనం కోరుకునే వాళ్లకి తప్పకుండా నచ్చుతుంది.

ప్ర) ప్రశాంత్ వర్మ కొత్త దర్శకుడు కదా ఎలా నమ్మకం ఉంచారు ?
జ) అతను కథను రాసిన విధానం, వివరించిన తీరు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అసలు అలాంటి కర్త రాశాడంటేనే అతను సగం సక్సెస్ అయినట్టు. అందుకే అతన్ని నమ్మాను. ఆటను కూడా నా నమ్మకాన్ని నిలబెట్టాడు.

ప్ర) మీ బ్యానర్లో మీరు సినిమా చేయనడానికి కారణం ?
జ) ఇక్కడునం ఎంతో మంది నిర్మాతలు నా ఎదుగుదలకు కారణమయ్యారు. ఈరోజు నాకు సొంతం బ్యానర్ ఉందని వాళ్ళని వదిలి నాకు నేనే సినిమాలు చేసుకోవడం భావ్యం కాదు. అందుకే నాకు ఎప్పుడూ నా నిర్మాతలకి, దర్శకులకి అందుబాటులోనే ఉంటాను.

ప్ర) మిగతా భాషల్లో డబ్ చేసే అవకాశాలున్నాయా ?
జ) సత్యం సినిమాస్ వాళ్ళు సినిమా చూసి చాలా బాగుందని రీమేక్ చేయడం కన్నా డబ్ చేసి వదిలితే బాగుంటుందని అన్నారు. అందుకే తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.

ప్ర) ఇకపైన కూడా నిర్మాతగా సినిమాలు రెగ్యులర్ చేస్తూనే ఉంటారా ?
జ) చేయాలనే ఉంది. కానీ నాక్కూడా సినిమాలున్నాయి కదా. అందుకే కొంచెం ఆలస్యమవచ్చు. కానీ కొత్త సినిమాలు రావడం మాత్రం ఆగదు. మా బ్యానర్లో చేసే ప్రతి సినిమా కొత్తగానే ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు