అక్కినేని కుటుంబం నుండి మూడు తరాల హీరోలు నటించిన సినిమా ‘మనం’. అయితే ఈ సినిమాలో చేసింది అతిధి పాత్రే అయినప్పటికీ సినిమాకే హై లైట్ గా నిలిచాడు అక్కినేని అఖిల్. ఈ సినిమాలోని అతని పాత్ర గురించి అఖిల్ మాట్లాడుతూ, “మొదటి సారి కెమెరా ముందుకు రాగానే చాలా భయం వేసింది. మొదట దర్శకుడు ఈ సినిమాలో నన్ను చూపిద్దాం అని నాన్నగారిని అడిగాడు, అయితే నాన్న ముందు నన్ను కధ వినమని చెప్పారు. విక్రమ్ నాకు కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఇక షూటింగ్ మొదటి రోజు, నా చేతులు వణకడం మొదలుపెట్టాయి. పదే పదే విక్రమ్ ని పిలిచి కథ చెప్పించుకునే వాడిని. తాతగారితో నటించడం నిజంగా నా అదృష్టం, నా జీవితాంతం ఇది గుర్తుండి పోతుంది” అని తన మనసులో మాటల్ని తెలిపాడు.
‘మనం’ విడుదలైన అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ సాధిస్తూ బాక్స్ ఆఫీసు వద్ద రికార్డులు నమోదు చేస్తుంది.


