
మాస్ మహారాజా రవితేజ హీరోగా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీ పై అనౌన్స్ మెంట్ నుండి అటు రవితేజ ఫ్యాన్స్ లో ఇటు నార్మల్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీని యువ దర్శకుడు వంశీ తెరకెక్కించారు.
ఒకప్పటి స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరావు లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ, తన కెరీర్ లో రవితేజ గారు ఇచ్చిన ఈ ఛాన్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని అన్నారు. అలానే మధ్యలో ఇతర సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మాకు కూడా రవితేజ గారు పక్కాగా డేట్స్ కేటాయించేవారని అన్నారు.
ఆయన ఒక హీరోగా కాకుండా అప్పట్లో తాను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన రోజులు మర్చిపోకుండా నన్ను మరింతగా ఎంకరేజ్ చేయడానికి ఎప్పటికప్పుడు వేగంగా షూటింగ్ కి డేట్స్ ఇవ్వడం నిజంగా గ్రేట్ అని అన్నారు. హీరోయిన్, ఇతర ఆర్టిస్ట్స్ తో పాటు ప్రతి ఒక్క టెక్నీషియన్ టైగర్ నాగేశ్వరరావు కోసం ఎంతో కష్టపడ్డారని తప్పకుండా అక్టోబర్ 20న మంచి సినిమా చూసాము అనే ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ నుండి బయటకి వస్తారని అన్నారు వంశీ.