టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన లేటెస్ట్ గ్రాఫికల్ వండర్ ‘బాహుబలి’ సక్సెస్ లో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ ఇచ్చిన సక్సెస్ మరియు అంచనాలతో బాహుబలి సీక్వెల్ విషయంలో రాజమౌళిపై బాధ్యత మరింత పెరిగింది. అందులో భాగంగానే రాజమౌళి ప్రస్తుతం సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఇదిలా ఉంటే రాజమౌళి తదుపరి సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తున్నాయి.
రాజమౌళి ఆయన కెరీర్లో ఏం సినిమా చేసినా అది భవిష్యత్ లో తను చేయనున్న మహా భారతం మూవీ కోసం ఒక మెట్టు మాత్రమే అని చెప్పాడు. ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికర విషయం నందమూరి అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది. రీసెంట్ గా ఇచ్చిన ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజమౌళిని ఇప్పడు మహా భారతం తీస్తే ఎవరిని శ్రీ కృష్ణుడుగా ఎంచుకుంటారు అనే ప్రశ్న అడిగితే రాజమౌళి వెంటనే ఇప్పుడున్న యంగ్ హీరోలలో ఎన్.టి.ఆర్ శ్రీ కృష్ణుడు పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని తెలిపాడు. ఎన్.టి.ఆర్ ఇప్పటికే జానపద సినిమా అయిన యమదొంగ సినిమాలో యముడిగా కనిపించి మెప్పించాడు. ఇప్పటి వరకూ శ్రీ కృష్ణుడు అంటే నందమూరి తారకరామారావు, ఆయన వారసుడైన ఎన్.టి.ఆర్ శ్రీ కృష్ణుడుగా పర్ఫెక్ట్ గా సరిపోతాడని నందమూరి అభిమానులు కూడా భావిస్తున్నారు.
