‘తిప్ప‌రామీసం’.. అమ్మ‌లంద‌రికీ డేడికేట్ చేస్తున్నాను !

‘తిప్ప‌రామీసం’.. అమ్మ‌లంద‌రికీ డేడికేట్ చేస్తున్నాను !

Published on Nov 4, 2019 11:37 AM IST

sreevishnu

శ్రీవిష్ణు హీరోగా నిక్కీ తంబోలి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం `తిప్ప‌రామీసం`. కాగా నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘ప్ర‌పంచంలో అన్ని మారతాయి.. కానీ ఎప్పటికీ అమ్మ ప్రేమ మాత్రం మార‌దు. అలాంటి అమ్మ ప్రేమ‌ పై నాకు ఎప్పటినుండో ఓ సినిమా చేయాల‌ని ఉండేది. అంతలో కృష్ణ విజ‌య్ ఈ క‌థ‌తో నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. రోహిణిగారు మా అమ్మ‌పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. సినిమా అంద‌రూ చూసేలా ఉంటుంది. ఓ గొప్ప ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా అవుతుంద‌ని ప్రామిస్ చేయ‌గ‌ల‌ను. మ‌న అమ్మ‌లంద‌రికీ మా తిప్ప‌రామీసం చిత్రాన్ని డేడికేట్ చేస్తున్నాను అన్నారు.

కాగా ఈ చిత్రం శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. యాక్ష‌న్ రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సిద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అలాగే ధ‌ర్మేంద్ర కాక‌రాల‌ ఎడిట‌ర్‌ గా వ్యవహరిస్తున్నారు. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కృష్ణ విజ‌య్ ఎల్ ప్రొడ‌క్ష‌న్‌, శ్రీ ఓం సినిమా ప‌తాకాల‌ పై కృష్ణ విజ‌య్‌.ఎల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు