అఖిల్‌కి నేనైతే 5 స్టార్స్ ఇస్తా : నాగార్జున

akhil
‘అఖిల్’.. సగటు తెలుగు సినీ అభిమానిని గత కొంతకాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన సినిమా. అక్కినేని వంశంలో మూడో తరం నుంచి అక్కినేని అఖిల్‌ను పరిచయం చేస్తూ రూపొందిన ఈ సినిమా టాలీవుడ్‌లో ఈ సీజన్ అత్యంత క్రేజ్ ఉన్న సినిమాగా నిలబడింది. వీవీ వినాయక్ దర్శకత్వంలో, నితిన్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నిన్న (నవంబర్ 11న) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. అక్కినేని వంశంలో పూర్తి స్థాయి మాస్ హీరో అనిపించుకోదగ్గ క్వాలిటీస్ ఉన్న నటుడిగా అఖిల్‌పై మొదట్నుంచీ విపరీతమైన ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మొదటిరోజు భారీ వసూళ్ళను రాబట్టి సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరోసారి స్పష్టం చేసింది.

ఇక అఖిల్ సినిమాకు అన్నిచోట్ల నుండీ సూపర్ రెస్పాన్స్ వస్తోందని, కలెక్షన్స్ చాలా బాగున్నాయని తెలుపుతూ అఖిల్ టీమ్ హైద్రాబాద్‌లో ఓ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్‌కు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. అఖిల్ సినిమా కలెక్షన్స్ చాలా బాగున్నాయని, మొదటి సినిమాకే అఖిల్‌కి ఈ స్థాయి కలెక్షన్స్ రావడం చూస్తే అసూయగా ఉందని సరదాగా మాట్లాడారు. ఇక మొదటి సినిమాకు నటన పరంగా అఖిల్‌కు తానైతే 5 స్టార్స్ ఇచ్చేస్తానని నాగార్జున ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

ఇక నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక డెబ్యూట్ హీరో నటించిన సినిమా మొదటి రోజే ఏకంగా 9.8 కోట్ల రూపాయలు వసూలు చేయడమనేది విశేషంగానే చూడాలని తెలిపారు. ఇక మరో నిర్మాత నితిన్ మాట్లాడుతూ.. మనం సినిమాలో క్లైమాక్స్‌లో కొద్దిసేపు కనిపించి అందరి అఖిల్ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంటే, ఈ సినిమాలో నాగార్జున కొద్దిసేపు ఓ పాటల కనిపించి మొత్తం క్రెడిట్ కొట్టేశారని తెలిపారు. మొదటి రోజు కలెక్షన్స్ బాగున్నాయని, రెండో రోజు కూడా కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా అదే స్థాయిలో కొనసాగుతున్నాయని నితిన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Exit mobile version