ప్రస్తుతం ప్రపంచం మొత్తం ట్రెండ్ సృష్టిస్తున్న ఐస్ బకెట్ చాలెంజ్ అనే ఫన్నీ టాస్క్ ఇప్పుడు ఇండియాని కూడా తాకింది/ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీస్, బిజినెస్ మేన్స్ చాలెంజ్ చేసిన ఈ టాస్క్ ఇప్పుడు ఇండియాలో ట్రెండ్ అవుతోంది. ఇండియాలో మొదటగా బాలీవుడ్ స్టార్ రితేష్ దేశ్ ముఖ్ స్టార్ట్ చేసి అభిషేక్ బచ్చన్, యువరాజ్ సింగ్ కి చాలెంజ్ చేసాడు. వాళ్ళు ఆ చాలెంజ్ ని తీసుకొని పలువురికి చాలెంజ్ చేసారు.
ఇదే విషయాన్ని అందాల భామ హన్సిక కూడా చాలెంజ్ గా తీసుకొని తన ఫ్రెండ్స్ కి చాలెంజ్ చేసింది అలాగే బాడ్మింటన్ ప్లేయర్ జ్వాల గుట్ట కూడా ఐస్ బకెట్ చాలెంజ్ ని చేయడమే కాకుండా టాలీవుడ్ యంగ్ హీరోస్ అయిన నితిన్, హర్షవర్ధన్ రాణే, రానా దగ్గుబాటిలకు ఈ టాస్క్ చెయ్యమని చాలెంజ్ చేసింది. ఈ టాస్క్ ని కాన్సర్ అవేర్నెస్ కోసం మొదలు పెట్టారు. చాలెంజ్ చేసినప్పుడు ఐస్ క్యూబ్స్ వాటర్ ని పైన పోసుకోవాలి లేదా ఓ కాన్సర్ రీసర్చి వారికి మనీ అన్నా డొనేట్ చేయవచ్చు.
ఈ ఐస్ బకెట్ చాలెంజ్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో బాగా ఫేమస్ అయ్యింది. ఈ చెఅలెంజ్ లో బిల్ గేట్స్, మార్క్ జుక్సేర్బర్గ్ కూడా పాల్గొన్నారు. అక్కడ ఫేమస్ అయిన ఈ టాస్క్ ఇండియాలో కూడా ఫేమస్ అవుతుందని ఆశిద్దాం. అలాగే కాన్సర్ మీద అవేర్నెస్ క్రియేట్ చెయ్యడం కోసం టాలీవుడ్ తారలు కూడా చేయి కలుపుతారని ఆశిద్దాం..


