భీమవరం టాకీస్ పతాకంపై దర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘ఐస్ క్రీమ్ 2’ సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో జెడి చక్రవర్తి, నవీనా, నందు, జీవా, ధనరాజ్, సిద్దు, భూపాల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీమ్ 2′ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. హారర్ తో పాటు గ్లామర్ కూడా పుష్కలంగా ఉన్న చిత్రమిది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ 7న ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
శాలిని, గాయత్రి, రామ్ గుప్తా, ప్రభాకర్, బినోజి ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : తుమ్మలపల్లి అంజని కుమార్ – టి భరత్ కుమార్, నిర్మాత : తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ!


