క్లైమాక్స్ చిత్రీకరణలో వర్మ ‘ఐస్ క్రీం-2’

క్లైమాక్స్ చిత్రీకరణలో వర్మ ‘ఐస్ క్రీం-2’

Published on Aug 19, 2014 1:31 PM IST

ice-cream-2

‘ఐస్ క్రీం’ సినిమాను అతి తక్కువ రోజులలో షూటింగ్ కంప్లీట్ చేసి, అత్యంత తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా తెరకెక్కిస్తున్న ‘ఐస్ క్రీం 2’కు కూడా అదే పంధాను అవలంబిస్తున్నారు. ఇటివలే షూటింగ్ స్టార్ట్ చేసిన వర్మ మేజర్ టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. త్వరలో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. సెప్టెంబర్ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘ఐస్ క్రీం 2’లో నటిస్తున్న ఆర్టిస్టులకు, వర్క్ చేస్తున్న టెక్నీషియన్లకు పారితోషకం ఇవ్వడం లేదు. సినిమా విడుదలయ్యకా లాభాలలో షేర్ ఇస్తారు. నవీన హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ స్టిల్స్ ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్నాయి. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో జెడి చక్రవర్తి, నందు, జీవా తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు