ఆ స్టార్ హీరో ప్లేస్ లో ఐకాన్ స్టార్.?

Published on Feb 14, 2023 2:00 pm IST

లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా దగ్గర ఓ రేంజ్ లో హైప్ ఇచ్చిన అప్డేట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చేస్తున్న మరి లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “జవాన్” లో నటిస్తున్నట్టుగా వచ్చిన వార్తే అని చెప్పాలి. ఈ సెన్సేషనల్ ఊహించని కాంబో నిజంగా సెట్ అయ్యినట్టే అని రూమర్స్ అయితే ఒక్కసారిగా స్ప్రెడ్ కాగా దీనిపై మరింత క్లారిటీ అయితే ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమాలో ఇది వరకే మరో టాప్ హీరో అయినటువంటి ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కూడా ఉండొచ్చని టాక్ వచ్చింది.

నిజానికి అట్లీ మొదట విజయ్ ని ఈ రోల్ కి అప్రోచ్ అయ్యాడట. కానీ తర్వాత ఇది ఐకాన్ స్టార్ దగ్గరకి వచ్చినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దీనితో విజయ్ ప్లేస్ లోకి అయితే ఇపుడు ఐకాన్ స్టార్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది కూడా ఒకందుకు మరీ మంచిది అని చెప్పొచ్చు. అటు నార్త్ లో బన్నీ క్రేజ్ గట్టిగా ఉంది అలాగే ఇక తెలుగులో చెప్పక్కర్లేదు. దీని బట్టి విజయ్ కన్నా అల్లు అర్జున్ అయితే ఇంకా బెటర్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :