‘మళ్ళీ రావా’ చిత్రం తరువాత సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇదం జగత్’. నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం తెరకెక్కిస్తున్న ఈచిత్ర టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. అంజు కురియన్ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రానికి గూఢచారి’ ఫెమ్ శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
జొన్నలగడ్డ పద్మావతీ, శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సరిగ్గా ఈచిత్రానికి ఒక రోజు ముందు నాగార్జున, నానిల ‘దేవదాస్’ ప్రేక్షకులముందుకు రానుంది. దాంతో సుమంత్ బాక్సాఫీస్ వద్ద దేవదాస్ తో పోటీపడనున్నాడు. మరి ఈ పోటీలో సుమంత్ విజయం సాధిస్తాడో లేదో చూడాలి.
