‘ఇద్దరి లోకం ఒకటే’.. ఇద్దరి పరిస్థితి ఒకటే.. !

Published on May 3, 2019 3:00 am IST

‘అర్జున్ రెడ్డి’…. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం, ఎవరూ ఊహించని విధంగా సంచలనాత్మక విజయాన్నే అందుకుంది. ఆ విజయానికి తగ్గట్లుగానే ఆ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ, ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అనిపించుకున్నాడు. కాకపోతే అర్జున్ రెడ్డికి హీరోయిన్ గా బోల్డ్ క్యారెక్టర్ లో రెచ్చిపోయిన షాలినీ పాండేకు మాత్రం, ఆ సినిమా తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఈ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ ‘118’ను మినహాయిస్తే.. అర్జున్ రెడ్డి తరువాత ఆమెకు హీరోయిన్ గా సరైన సినిమానే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హీరోయిన్ కు ఇప్పుడు ఓ మంచి ఆఫర్ వచ్చింది. అదే ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కబోతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’.

ఈ సినిమాలో షాలినీ పాండేను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఇది షాలినీ పాండేకు భారీ ఆఫరే. మరి ఈ సినిమాతోనైనా షాలినీ పాండేకు కాలం కలిసి వస్తోందేమో చూడాలి. ఇక రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. మొత్తానికి ప్లాప్స్ లో ఉన్న ఈ హీరోహీరోయిన్ల ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం ఒక్కటే. మరి ‘ఇద్దరి లోకం ఒకటే’తోనైనా ఈ ఇద్దరి పరిస్థితి మారాలని ఆశిద్దాం.

ఇక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో జిఆర్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ కె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More