హైదరాబాద్‌లో ఇండియన్‌ ఐడల్‌ గాయకులు స్పెషల్ ప్రోగ్రాంస్..!

Published on Aug 29, 2021 1:02 am IST

ఇండియన్ ఐడల్ సింగర్లు తమ గానంతో హైదరాబాద్‌ని ఉర్రూతలూగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘రివైవ్‌ కన్సర్ట్‌ సిరీస్‌’ పేరుతో ఎలెవన్‌ పాయింట్‌ టు, మెటలాయిడ్‌ ప్రొడక్షన్స్‌ ఈవెంట్ ఆర్గనైజింగ్‌ సంస్థలు సంయుక్తంగా ఇండియన్‌ ఐడల్‌ గాయకులతో స్పెషల్ మ్యూజిక్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇండియన్‌ ఐడల్‌ విజేత పవన్‌దీప్‌ రాజన్‌, మొదటి రన్నరప్ అరుణిత కంజిలాల్, రెండో రన్నరప్ శైలి, మూడో రన్నరప్ మొహమ్మద్ డానిష్‌తో పాటు షణ్ముఖ ప్రియ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే సెప్టెంబ‌ర్ నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించాలని ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత సమాచారం :