‘సూపర్ స్టార్’ ఇక సినిమాలు తగ్గిస్తే బాగుంటుంది !

‘సూపర్ స్టార్’ ఇక సినిమాలు తగ్గిస్తే బాగుంటుంది !

Published on Jun 12, 2018 12:09 PM IST

Aishwaryaa

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతలా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజనీ ఇంకా ఎక్కువ చిత్రాల్లో నటిస్తే బాగుంటుందని ఆయన అభిమానులందరూ ఎంతగానో ఆశ పడతారు. అలాంటిది ఆయన కుమార్తె ‘ఐశ్వర్య ధనుష్’ మాత్రం రజనీ ఇక సినిమాలు తగిస్తే బాగుంటుందంటున్నారు.

ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ రజనీ పూర్తిగా సినిమాలకే పరిమితమవ్వకుండా సినిమాలు మెల్లగా తగ్గించేసి కుటుంబ సభ్యులైన మాతో ఎక్కువ సమయాన్ని గడపాలని ఐశ్వర్య కోరుకున్నారు. జీవితంలో ఎదురయ్యే బాధనైనా, ఆనందాన్నైనా సమానంగా తీసుకోవాలని రజనీకాంత్ ఎప్పుడూ చెప్తూ ఉంటారని ఆ వ్యాఖ్యమంటే తనకు బాగా ఇష్టమని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్, కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డార్జిలింగ్ లో ఈ చిత్రం షూటింగ్ కూడా జరుపుకుంటోంది. ప్రముఖ నిర్మాత ‘కళానిధి మారన్’ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు