ఆ కాంబినేషన్ రద్దైతేనే ముద్దు అంటున్న బాలయ్య ఫ్యాన్స్

Published on Jun 6, 2019 3:59 am IST

హీరో బాలయ్య, సీనియర్ దర్శకులు కె ఎస్ రవికుమార్ కాంబినేషన్ లో రావలసిన మూవీ అటకెక్కిందని కొన్ని రోజుల క్ర్తితం జోరుగా ప్రచారం జరిగింది. ఐతే అందులో నిజం లేదంట. అది తాత్కాలిక విరమమే కానీ, పూర్తిగా మూవీని రద్దు చేయలేదట. ఇప్పుడు ఈ విషయమే బాలయ్య అభిమానులకు నచ్చడం లేదంట. కారణం వీరిద్దరి కంబినేషన్ లో వచ్చిన జై సింహ జస్ట్ యావరేజ్ సినిమా. కాబట్టి బాలయ్య బోయపాటి, లేదా వేరే దర్శకుడితో చేయడం ఉత్తమం అని వారి వాదన. అయితే బాలయ్య ఇచ్చిన మాట తప్పను అంటూ కేఎస్ రవికుమార్ తో కథ మార్చి మరీ సినిమా చేస్తున్నాడని తాజా సమాచారం. ఆ సినిమా 12న ముహూర్తం చేసుకుని నెలాఖరుకు సెట్స్ మీదకు వెళ్తుందట.

ఏది ఏమైనా ఈ సినిమా మాత్రం తప్పకపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సంవత్సరం వచ్చిన ఎన్టీఆర్ చిత్రం రెండు భాగాలు బాక్స్ ఆఫీసు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. నెక్స్ట్ మూవీ అయినా బాలయ్య మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడితో చేసి హిట్ కొట్టాలని వారిఫ్యాన్స్ ఆశ. మరి చివరకు ఏమౌతుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More