ప్రభాస్ లేకపోతే “ఆదిపురుష్” లేనే లేదు – ఓం రౌత్

ప్రభాస్ లేకపోతే “ఆదిపురుష్” లేనే లేదు – ఓం రౌత్

Published on Jan 6, 2021 12:03 PM IST

Prabhas Om Raut

“బాహుబలి” సినిమాతో తన కటౌట్ కి ఎంత పవర్ ఉందో ఇప్పుడు ప్రభాస్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారని చెప్పాలి. దాని తర్వాత పూర్తిగా భిన్నమైన “సాహో” అనే ఫుల్ ఆన్ యాక్షన్ డ్రామాలో నటించి దాని తర్వాత మరో పీరియాడిక్ లవ్ స్టోరీకి శ్రీకారం చుట్టారు. ఇక ఇదిలా ఉండగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో “ఆదిపురుష్” అనే భారీ మైథలాజికల్ వండర్ లో నటించడానికి ఒప్పుకున్నారు. అందులో శ్రీరాముని పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు.

అయితే ఈ చిత్ర దర్శకుడు ఈ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేసినపుడే తనకి మొట్ట మొదటిసారిగా ఈ సినిమాకు విజువల్ వచ్చింది ప్రభాసే అని చెప్పారు. మరి అలాగే లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే అసలు ప్రభాస్ లేకపోతే ఆదిపురుష్ అనే సినిమా లేనే లేదని అతను కనుక ఒప్పుకోకపోతే ఈ సినిమా చేసి ఉండే వాడిని కాదు అని ఓంరౌత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ హై అండ్ ఎనర్జీను ఇస్తున్నాయి. దీనితో ఓంరౌత్ ఖచ్చితంగా ప్రభాస్ కు ఒక అద్భుతమైన సినిమా ఇస్తాడని చాలా నమ్మకంగా ఉన్నారు.

తాజా వార్తలు