పద్మ విభూషణ్ వెనక్కి ఇవ్వడంపై ఇళయరాజా ఏమన్నారంటే

Published on Jan 19, 2021 8:58 pm IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు, ప్రసాద్ స్టూడియోస్ యాజమాన్యానికి మధ్యన ఇటీవల పెద్ద వివాదం నడిచిన సంగతి తెలిసిందే. చివరికి ఇళయరాజా తాను మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న రికార్డింగ్ స్టూడియోను వదిలేసి బయటికొచ్చేశారు. ఇంతటితో ఈ వివాదం ముగిసింది అనుకుంటే ఇళయరాజా ప్రసాద్ స్టూడియోస్ యాజమాన్యం చేసిన అవమానానికి తన పద్మ విభూషణ్ అవార్డును తిరిగి ప్రభుత్వానికే ఇచ్చేయడానికి సిద్ధమయ్యారని వార్తలు మొదలయ్యాయి. దీంతో వివాదం మరింత ముదిరింది.

అయితే ఈ విషయంపై ఇళయరాజా నేరుగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తాను తన పద్మ విభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నాననే వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని. అవి ఎవరో కావాలని పుట్టించిన పుకార్లని కొట్టిపారేశారు. అయితే కోర్టు ఉత్తర్వుల తర్వాత ఇళయరాజా తన వస్తువులను వెనక్కి తెచ్చుకోవడానికి ప్రసాద్ స్టూడియోకి తన సిబ్బందిని పంపగా ఆయన రికార్డింగ్ స్టూడియోను అప్పటికే కూలగొట్టారని, అందులోని ఇళయరాజాకు చెందిన ప్రతిష్టాత్మక పద్మ విభాషణ్ అవార్డుతో పాటు మిగిలిన ప్రముఖ అవార్డులను, ఫోటోలను ఒక స్టోర్ రూంలో పడేశారని, అది తెలిసి ఆయన తీవ్రంగా నొచ్చుకున్నారని పలువురు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :